Skip to main content

Posts

Featured

KuchipuDi Recital at My Home Abhra: June 28, 2025

  దీవెనల రాగమై మ్రోగనీ కన్నతల్లి సందేశం ప్రకృతి సాక్ష్యమై సాగనీ విశాలవిశ్వరంగప్రవేశం సరిగ్గా ఏడాది క్రితం, జూలై 14 2024, రాగ రంగప్రవేశం సందర్భంగా నేను రాసిన పాటలోని పల్లవి ఇది. ఈ ఏడాది జూన్ 28, 2025 న ఈ పదాలకి నిజమైన సార్థకత వచ్చిందని నాకనిపిస్తోంది! తన మనవరాలి రంగప్రవేశం కళ్ళారా చూసినప్పటినుంచీ ఎలాగైనా తన ఇతర కుటుంబసభ్యులకీ స్నేహితులకీ కూడా తన నాట్యం చూపించాలని ఉబలాటపడింది మా అమ్మ. మేము వేసవిసెలవలకి వస్తున్నామని తెలిసిన మరుక్షణం అమ్మ మనసులో మెదిలింది- హైదరాబాదులో తన మనవరాళ్ళ నృత్య ప్రదర్శన. ఫోన్లో అమ్మ నాతో ఈ విషయం చెప్పినప్పుడు యథాలాపంగా అలాగే అని చెప్పాను- బోలెడన్ని పరికిణీలున్నాయి, పాటల రికార్డింగులున్నాయి, ఏదో ఒక పరికిణీ వేసి, అందుబాటులో ఉన్న ఒక పాట ప్లే చేసి, ఏదో ఒక డాన్స్ చేయించేద్దాములే దానిదేముంది అనుకున్నాను. మేము ఏ మాత్రం దీని గురించిన ముందస్తు ఆలోచన చెయ్యకుండా హైదరాబాదులో అడుగుపెట్టాము. వచ్చీ రాగానే జూన్ 28కి మన హాలు బుక్ చేసానని అమ్మ చెప్పాక నాకు కంగారు మొదలైంది.  అది మొదలు, అక్కకి ఈ డాన్స్ ప్రోగ్రాం తయారీ ఫుల్ టైం జాబ్ ఐపోయింది. పిల్లలిద్దరికీ అప్పటికప్పుడు డాన్స...

Latest Posts

Rangapravesam- the year since!

Rangapravesam Day: Part-3

Rangapravesam Day: Part-2